Monday 16 February 2015

అస్సాంలో ముష్కరులు 100 మంది నిండు ప్రాణాలను నిష్కారణం గా ,నిర్దాక్షిణ్యం గా తీసిన వార్త కు నా స్పందన ప్రపంచం లో ఎక్కడ అన్యాయం జరిగినా నాలో భావావేశం పొంగుతూనే వుంటుంది   30-12-14

కరుడు కట్టిన కసాయీ ,నీకక్ష ఎవరి పైనోయి ?
నీ చేతిలో హతమయిన వారి ఆక్రందనలు

నీ చెవులకు చేరలేదా, ,వికటాట్ట హాసం చేస్తూ
పారే రక్తపుటేరులు ,శ వాల గుట్టలు చూస్తూ

ఇంకా వున్న నువ్వు మృగంగా మారావని నీకు తెలుసా
నీ రక్త దాహం తీరిందా ? నీకు పాశవిక ఆనందం కలిగిందా

నీ మృగ తృష్ణ తీరిందా ,,నీపుట్టుకే ఒక శాపం
ఎందుకు చేసారో నీ తల్లి తండ్రులు నిన్ను కనే పాపం
Like ·  · 
మకర సంక్రాంతి వచ్చి తనతో సంబరాలు తెచ్చెనులే 
ముంగిళ్ళు రంగు, రంగుల రంగవల్లులతో మురిసేనులే
మామిడి తోరణాల ద్వా రాలు స్వాగతాలు పలుకునులే 
లేత మామిడి చిగురులు తిన్న కోయిల రాగాలే మధురములే
హరిలో రంగ హరి అనిహరిదాసులు గొంతెత్తి పాడెదరు లే 
గంగి రెద్దులు రంకేవేసి అయ్యవారికి దండాలు పెట్టేనులే
శీతల పవనాల చలిని భోగి మంటలు కాచునులే 
చిన్నారులకు భోగి పళ్ళు పోసి మురిసేములే
ఇంటింటా దేవతలు బొమ్మల్లో కోలువై వుందు రులే 
తెరుచుకున్న ఉత్తర ద్వారాలు ముక్తికి మార్గాలే చూపును లే
ఇంటింటా పొంగళ్ళ నైవేద్యాలు ,పిండివంటల ఘుమ , ఘుమలే 
సంక్రాంతి లక్ష్మీ సంతసించి ధన ధాన్యాల నోస గునులే
వేంకటేశుడు మనపై దయతో వరాల నోసగునులే
మా సంక్రాంతి శుభా కాంక్షలు అందరూ అందుకోవలె



ముద్దుగారే మోము వాడే
మది దోచే మోహనా కారుడే 
యశోదమ్మ గారాల బిడ్డడే 
ఆమె నోము ఫలము అతడే 
క్షణమయినా ఆమెను వీడ లేడే 
తల్లి ప్రేమకు దాసుడే
ఇద్దరు తల్లుల ప్రాణము ఈతడే
జగములనేలే పరమాత్ముడే
యుగాలుగా జనులను కాపాడే
మూడు లోకాల రక్షకుడే ,
శరణన్న వారిని కాచే వత్సలుడే
ఈ చిన్ని శిశు వెంతటి వాడే
మాయా మొహము లో వీడే
మనలను బ్రోచు వాడే
సత్యము ,ఈతని మహాత్యము
జనులారా నమ్మి తరించరే

Sunday 30 March 2014

                                   

శ్రీ జయనామ  సంవత్సరానికి   స్వాగతాలు

వసంత మాస   ఆగమనం తో పుడమి  అంతట పచ్చ దనం
వృక్షాలన్నీ  కొత్త చిగుళ్ళతో  నిండుగా  ఆహ్లాదంగా వున్నాయి   
మావిచిగుళ్ళు  తిన్న కోయిలలు   మై మరచి కొత్త  రాగాలు   ఆలపిస్తున్నాయి
ప్రకృతి  కాం  వింత  సోయగంతో   మెరిసి,  మురిసి పోతోంది 
                                                                                                                                                             రంగు ,రంగుల   రంగవల్లికలతో  కళకళ  లాడుతున్న  లోగిళ్ళు
మామిడి  తోరణాలవాకిళ్ళు   ,ష డ్రుచుల ఉగాది  పచ్చ ళ్ళు , పిండివంటలు
తొలి పండగ   సందడిలో  కొత్త  జంటల సరదాల  సరాగాలు
పంచాంగ   శ్రవణాల తో ,   భక్తులతో  కిక్కిరిసిన న దేవాలయాలు


పరిక్షల  ముగింపుతో సంబరాలు చేసుకుంటున్న చిన్నారుల కేరింతలు
కొత్త సంవత్సరం ,కొత్త  ఆలోచనలు ,కొత్త ప్రణాళికలు కొత్త కందాయ ఫలాలు
ముక్త  ఖంఠము తో సరి కొత్త ఉత్సాహంతో  పూరించండి  శంఖాలు                                                             విజయాలు  అందించే    శ్రీ జయనామ  సంవత్సరానికి స్వా గతాలు

కొత్త సంవత్సరంలో  అందరూ ఆయురారోగ్య ,ఐశ్వర్యాలతో ,విజయ పరం పరలతో ,
ఆ వేంకటేశుని  ఆశీస్సులతో    సుఖ,శాంతులతో  వర్దిల్లాలని  కోరుకుంటున్నా ను 

Friday 7 March 2014

o padati


అచ్చట్లు  ముచ్చట్లు
ముద్దు మురిపాలు
పుట్టింట జరిగినట్లు
మెట్టినింట అసిన్చకుమా  ఓ పడతి
చదువులలో  మేటి
ఏ పనికయినా సరిసాటి
వుద్యోగములలోను ఘనాపాటి
అయినా నీకు కష్టాలు తప్పవే  ఓ పడతి
ఆచి  తూచి అడుగు వేయి
మేడి పండాయే  యీ  లోకము
మరువకుమా    యీ నిజము
నీ ధైర్యమే  నీకు శ్రీ రామ రక్ష  ఓ పడతి

సతులకు  ,సోదరీ మణులకు
అమ్మలకు ,అమ్మలగన్న ,అమ్మలకు
చిన్నారులకు ,చిట్టి పాపలకు
అందరికీ  ఇవే మహిళా దిన శుభాకాంక్షలు

ఆడపిల్లలు  రకరకాల  ఇబ్బందులు పడటం చూస్తున్నాం  ఇ  మహిళా దినోత్సవం  నాడు  యిలా వారికి సందేశం ఇవ్వాలనే  ఆలోచనతో  రాశాను  సోదరులు ,అయ్యలు, అయ్యలనుగన్నయ్యలు ,బిడ్డలు నొచ్చు  కోరని భావిస్తున్నా 

Saturday 1 February 2014

nava samajam vastene stri manugada

ఆటవిక జీవనం  వదలి  మనిషి ఆధునిక  జీవితంలో అడుగుపెట్టిన
నేటి సమాజంలో  జాలి,ప్రేమ ,కరుణ మృగ్య మవుతున్నాయి 
హింస , స్వార్ధం అరాచకాలు ప్రజ్వరిల్లుతున్నాయి ,దీనికి ఎవరు భాద్యులు 
సంఘమ అవును మనమందరం  బాధ్యులమే  అడ,మగ వివక్షలను ఆపేద్దాము  
కాకమ్మ కధలు ,మదనకామరాజు కధలు యిక చెప్పొద్దు 
మగాడు ఏమి  చేసినా చెల్లుతుంది అని నూరిపోయ్యొద్దు 
మీ బిడ్డల  దురాగతాలకు  మీరే ఆజ్యం పొయ్యొద్దు 
వారి అర్ధంతర చావుకు ముహుర్తాలు పెట్టు కోవద్దు 
మన ఆలోచనల్లోనే  మార్పు రావాలి మనం మారితే  సమాజం కూడా మారగలదు
రాముడు కాకపోయినా   రావణ్హుడుగు గ మారకు పురుషుడా
మగువ బాపుబొమ్మ (బార్బిబొమ్మ ),అజంతశిల్పం అన్న పాదాలను తిరస్కరించు
కాళీ ,దుర్గ,మహిషాసుర మర్దనిలనే ఆదర్శంగా తీసుకుని ఉపాసించు
కరాటే ,కర్రసాము లాంటి విద్య లను యిక అభ్యసించు
తప్పక పొతే కత్తి ,డాలు ధరించే సంచరించు  
నిత్యకామాగ్నికి బలి అవుతున్న ఓ అబలా
నిన్ను నువ్వు మార్చుకో    స  బలగా నిరూపించుకో
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించుకో
నిన్ను ,నువ్వే శక్తివి,యుక్తిగా మసలుకో
స్త్రీ ని కామించడం,కాంక్షి చడం  మగతనం కాదోయి
ఓ పురు షుడా స్త్రీ పొండుకొసమే జీవితాంతం పరి తపించకోయి
మగ జాతి లో సౌర్యం నశించి మంద మతులై దుర్మార్గులై
మగువలను కడ తే ర్చడమే జీవిత లక్ష్యం గా భావించాకోయి     

Monday 25 November 2013

Sirikoluvu



 సిరికొలువు అందరూ చదవవలసిన పుస్తకం . పదకవితా పితామహుడు అన్నమయ్య తన  8వ ఏటనే రాయడం  ప్రారంభించెను .తొలిసారి తిరుమల కు  వచ్చిన  ఆనందములో అతని నోటి వెంట ఆశువుగా  పదాలు పలికాయిట . తన తల్లి  అయిన లక్కమాంబ తిరుమల కొండ గురించి అద్భుతంగా  వర్ణించి చెప్పినది మాత్రమే విన్న అన్నమయ్య  తిరుమలను చూసి పరమానంద భరితుడయ్యాడు చేతిలోని ఒంటి తీగ దండాన్ని మీటుతూ ,పాడుతూ ,చిందులేస్తూ  "అదివో అల్లదివో  శ్రీహరి వాసము ,పదివేలశేషుల  పడగలమయము "అలపించారుట .  అలా కొండ  ఎక్కుతూ అలిపిరిలోని  శ్రీవెంకటేసుని   శిలా పాదాలు దర్శించి  "బ్రహ్మకడిగిన పాదము  ,బ్రహ్మము తానే  నీపదము "అని  కొనియా డా రుట