Monday 16 February 2015

అస్సాంలో ముష్కరులు 100 మంది నిండు ప్రాణాలను నిష్కారణం గా ,నిర్దాక్షిణ్యం గా తీసిన వార్త కు నా స్పందన ప్రపంచం లో ఎక్కడ అన్యాయం జరిగినా నాలో భావావేశం పొంగుతూనే వుంటుంది   30-12-14

కరుడు కట్టిన కసాయీ ,నీకక్ష ఎవరి పైనోయి ?
నీ చేతిలో హతమయిన వారి ఆక్రందనలు

నీ చెవులకు చేరలేదా, ,వికటాట్ట హాసం చేస్తూ
పారే రక్తపుటేరులు ,శ వాల గుట్టలు చూస్తూ

ఇంకా వున్న నువ్వు మృగంగా మారావని నీకు తెలుసా
నీ రక్త దాహం తీరిందా ? నీకు పాశవిక ఆనందం కలిగిందా

నీ మృగ తృష్ణ తీరిందా ,,నీపుట్టుకే ఒక శాపం
ఎందుకు చేసారో నీ తల్లి తండ్రులు నిన్ను కనే పాపం
Like ·  · 
మకర సంక్రాంతి వచ్చి తనతో సంబరాలు తెచ్చెనులే 
ముంగిళ్ళు రంగు, రంగుల రంగవల్లులతో మురిసేనులే
మామిడి తోరణాల ద్వా రాలు స్వాగతాలు పలుకునులే 
లేత మామిడి చిగురులు తిన్న కోయిల రాగాలే మధురములే
హరిలో రంగ హరి అనిహరిదాసులు గొంతెత్తి పాడెదరు లే 
గంగి రెద్దులు రంకేవేసి అయ్యవారికి దండాలు పెట్టేనులే
శీతల పవనాల చలిని భోగి మంటలు కాచునులే 
చిన్నారులకు భోగి పళ్ళు పోసి మురిసేములే
ఇంటింటా దేవతలు బొమ్మల్లో కోలువై వుందు రులే 
తెరుచుకున్న ఉత్తర ద్వారాలు ముక్తికి మార్గాలే చూపును లే
ఇంటింటా పొంగళ్ళ నైవేద్యాలు ,పిండివంటల ఘుమ , ఘుమలే 
సంక్రాంతి లక్ష్మీ సంతసించి ధన ధాన్యాల నోస గునులే
వేంకటేశుడు మనపై దయతో వరాల నోసగునులే
మా సంక్రాంతి శుభా కాంక్షలు అందరూ అందుకోవలె



ముద్దుగారే మోము వాడే
మది దోచే మోహనా కారుడే 
యశోదమ్మ గారాల బిడ్డడే 
ఆమె నోము ఫలము అతడే 
క్షణమయినా ఆమెను వీడ లేడే 
తల్లి ప్రేమకు దాసుడే
ఇద్దరు తల్లుల ప్రాణము ఈతడే
జగములనేలే పరమాత్ముడే
యుగాలుగా జనులను కాపాడే
మూడు లోకాల రక్షకుడే ,
శరణన్న వారిని కాచే వత్సలుడే
ఈ చిన్ని శిశు వెంతటి వాడే
మాయా మొహము లో వీడే
మనలను బ్రోచు వాడే
సత్యము ,ఈతని మహాత్యము
జనులారా నమ్మి తరించరే