Monday 16 February 2015

మకర సంక్రాంతి వచ్చి తనతో సంబరాలు తెచ్చెనులే 
ముంగిళ్ళు రంగు, రంగుల రంగవల్లులతో మురిసేనులే
మామిడి తోరణాల ద్వా రాలు స్వాగతాలు పలుకునులే 
లేత మామిడి చిగురులు తిన్న కోయిల రాగాలే మధురములే
హరిలో రంగ హరి అనిహరిదాసులు గొంతెత్తి పాడెదరు లే 
గంగి రెద్దులు రంకేవేసి అయ్యవారికి దండాలు పెట్టేనులే
శీతల పవనాల చలిని భోగి మంటలు కాచునులే 
చిన్నారులకు భోగి పళ్ళు పోసి మురిసేములే
ఇంటింటా దేవతలు బొమ్మల్లో కోలువై వుందు రులే 
తెరుచుకున్న ఉత్తర ద్వారాలు ముక్తికి మార్గాలే చూపును లే
ఇంటింటా పొంగళ్ళ నైవేద్యాలు ,పిండివంటల ఘుమ , ఘుమలే 
సంక్రాంతి లక్ష్మీ సంతసించి ధన ధాన్యాల నోస గునులే
వేంకటేశుడు మనపై దయతో వరాల నోసగునులే
మా సంక్రాంతి శుభా కాంక్షలు అందరూ అందుకోవలె



2 comments:

  1. nice poem and awesome pictures
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete