Saturday 1 February 2014

nava samajam vastene stri manugada

ఆటవిక జీవనం  వదలి  మనిషి ఆధునిక  జీవితంలో అడుగుపెట్టిన
నేటి సమాజంలో  జాలి,ప్రేమ ,కరుణ మృగ్య మవుతున్నాయి 
హింస , స్వార్ధం అరాచకాలు ప్రజ్వరిల్లుతున్నాయి ,దీనికి ఎవరు భాద్యులు 
సంఘమ అవును మనమందరం  బాధ్యులమే  అడ,మగ వివక్షలను ఆపేద్దాము  
కాకమ్మ కధలు ,మదనకామరాజు కధలు యిక చెప్పొద్దు 
మగాడు ఏమి  చేసినా చెల్లుతుంది అని నూరిపోయ్యొద్దు 
మీ బిడ్డల  దురాగతాలకు  మీరే ఆజ్యం పొయ్యొద్దు 
వారి అర్ధంతర చావుకు ముహుర్తాలు పెట్టు కోవద్దు 
మన ఆలోచనల్లోనే  మార్పు రావాలి మనం మారితే  సమాజం కూడా మారగలదు
రాముడు కాకపోయినా   రావణ్హుడుగు గ మారకు పురుషుడా
మగువ బాపుబొమ్మ (బార్బిబొమ్మ ),అజంతశిల్పం అన్న పాదాలను తిరస్కరించు
కాళీ ,దుర్గ,మహిషాసుర మర్దనిలనే ఆదర్శంగా తీసుకుని ఉపాసించు
కరాటే ,కర్రసాము లాంటి విద్య లను యిక అభ్యసించు
తప్పక పొతే కత్తి ,డాలు ధరించే సంచరించు  
నిత్యకామాగ్నికి బలి అవుతున్న ఓ అబలా
నిన్ను నువ్వు మార్చుకో    స  బలగా నిరూపించుకో
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించుకో
నిన్ను ,నువ్వే శక్తివి,యుక్తిగా మసలుకో
స్త్రీ ని కామించడం,కాంక్షి చడం  మగతనం కాదోయి
ఓ పురు షుడా స్త్రీ పొండుకొసమే జీవితాంతం పరి తపించకోయి
మగ జాతి లో సౌర్యం నశించి మంద మతులై దుర్మార్గులై
మగువలను కడ తే ర్చడమే జీవిత లక్ష్యం గా భావించాకోయి