Monday 24 September 2012



ప్రపంచంలో ఎవరూ కర్తలు కారు ,అందరూ పరిస్తితుల్ని బట్టే వుంటారు .
నిజాయితీ తోటే ధైర్యం వస్తుంది .మనసులో ఉన్నదే చెప్పాలి ,చెప్పిందే చెయ్యాలి దీనినే త్రికరణ శుద్ధిగా  అంటారు ..విద్య ,పూజ ,స్నేహం ,బంధుత్వం ,ఏపనిలో  అయినావిజయం  సాధిచాలంటే త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పక ఫలిస్తుంది  ఇక్కడ ఆలస్యం కావచ్చు ,కానీ అపజయం వుండదు .చూపు ,మాట,చేత వొక్కటి కావడమే ,ఉండడమే దీని అర్ధం .సంస్కృతంలో మనో ,వాక్,కర్మణ అని కూడా అంటారు .


Friday 21 September 2012


జీవితం పూలపానుపు కాదు .జీవితంలో సుఖదుఃఖాలు రెండూ వుంటాయి .గెలుపువోట ములు వుంటాయి .కష్టాలను జయించాదనికే మనం ఈ లోకంలోనికి వచ్చాము .ప్రతి సమస్యకు తప్పనిసరిగా  ఏదో వొక పరష్కారం వుంటుంది .దాన్ని సాధించడానికి మనకు కావాల్సిందల్లా  కొంచం సహనం, ఆత్మ విశ్వాసం ,కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగల ధృడ చిత్తం .




Thursday 20 September 2012

Jeevitam _jeevinchadam

నేను ఎవర్ని అన్న ప్రశ్న సిద్ధర్దుడిని గౌతమబుద్దునిగా , ఒక  సాధారణ వ్యక్తిని  రమణ మహర్షిగా  మార్చేసింది ముందు  మనల్ని  మనం తెలిసికోవాలి .మనజీవిత పరమార్ధం  తెలిసుకోవాలి ,జీవితనికోలక్ష్యం  వుండాలి ,అపుడు జీవించడంలోని  ఆనందమే వేరు.చిన్న,చిన్న  లక్ష్యాలను ఎంచుకోవాలి ,అవి అందుకున్నాక  ఇంకొంచం పెద్ద  వాటికోసం ప్రయత్నించాలి