Sunday 30 March 2014

                                   

శ్రీ జయనామ  సంవత్సరానికి   స్వాగతాలు

వసంత మాస   ఆగమనం తో పుడమి  అంతట పచ్చ దనం
వృక్షాలన్నీ  కొత్త చిగుళ్ళతో  నిండుగా  ఆహ్లాదంగా వున్నాయి   
మావిచిగుళ్ళు  తిన్న కోయిలలు   మై మరచి కొత్త  రాగాలు   ఆలపిస్తున్నాయి
ప్రకృతి  కాం  వింత  సోయగంతో   మెరిసి,  మురిసి పోతోంది 
                                                                                                                                                             రంగు ,రంగుల   రంగవల్లికలతో  కళకళ  లాడుతున్న  లోగిళ్ళు
మామిడి  తోరణాలవాకిళ్ళు   ,ష డ్రుచుల ఉగాది  పచ్చ ళ్ళు , పిండివంటలు
తొలి పండగ   సందడిలో  కొత్త  జంటల సరదాల  సరాగాలు
పంచాంగ   శ్రవణాల తో ,   భక్తులతో  కిక్కిరిసిన న దేవాలయాలు


పరిక్షల  ముగింపుతో సంబరాలు చేసుకుంటున్న చిన్నారుల కేరింతలు
కొత్త సంవత్సరం ,కొత్త  ఆలోచనలు ,కొత్త ప్రణాళికలు కొత్త కందాయ ఫలాలు
ముక్త  ఖంఠము తో సరి కొత్త ఉత్సాహంతో  పూరించండి  శంఖాలు                                                             విజయాలు  అందించే    శ్రీ జయనామ  సంవత్సరానికి స్వా గతాలు

కొత్త సంవత్సరంలో  అందరూ ఆయురారోగ్య ,ఐశ్వర్యాలతో ,విజయ పరం పరలతో ,
ఆ వేంకటేశుని  ఆశీస్సులతో    సుఖ,శాంతులతో  వర్దిల్లాలని  కోరుకుంటున్నా ను 

Friday 7 March 2014

o padati


అచ్చట్లు  ముచ్చట్లు
ముద్దు మురిపాలు
పుట్టింట జరిగినట్లు
మెట్టినింట అసిన్చకుమా  ఓ పడతి
చదువులలో  మేటి
ఏ పనికయినా సరిసాటి
వుద్యోగములలోను ఘనాపాటి
అయినా నీకు కష్టాలు తప్పవే  ఓ పడతి
ఆచి  తూచి అడుగు వేయి
మేడి పండాయే  యీ  లోకము
మరువకుమా    యీ నిజము
నీ ధైర్యమే  నీకు శ్రీ రామ రక్ష  ఓ పడతి

సతులకు  ,సోదరీ మణులకు
అమ్మలకు ,అమ్మలగన్న ,అమ్మలకు
చిన్నారులకు ,చిట్టి పాపలకు
అందరికీ  ఇవే మహిళా దిన శుభాకాంక్షలు

ఆడపిల్లలు  రకరకాల  ఇబ్బందులు పడటం చూస్తున్నాం  ఇ  మహిళా దినోత్సవం  నాడు  యిలా వారికి సందేశం ఇవ్వాలనే  ఆలోచనతో  రాశాను  సోదరులు ,అయ్యలు, అయ్యలనుగన్నయ్యలు ,బిడ్డలు నొచ్చు  కోరని భావిస్తున్నా