కోటి దండాలు నీకు కొండ దేవర
ఏడు కొండలపైన వున్నావు కొండదేవర
మా కష్టాలు గట్టేక్కించు కొండదేవర
ముడుపులు కడ తమయ్య కొండదేవర
పొర్లి దండాలు నీకు కొండ దేవర
మా పాపాలు కడిగేయి కొండదేవర
అసలు వడ్డీ కూడ ఇస్తమయ్య కొండదేవర
మా ఆశలను పండించు కొండదేవర
ఏడు కొండలెక్కి వస్తమయ్య కొండదేవర
మా కోరికలు తీర్చ వయ్య కొండదేవర
తల నీలాలు ఇస్తమయ్య కొండదేవర
మా తప్పులను మన్నించు కొండదేవర
గోవింద ,గోవింద అంటూ గొంతెత్తి పిలిచేము
మా గోడు ఆల కించు కొండదేవర
దుష్టు లను శిక్షించు శిష్టులను రక్షించు
కలియుగ దైవమా వెంకటేశ్వర
నిను అను నిత్యం కొలుచు కుంట మయ్య
మము కాపాడు , రక్షించు ,నడిపించు " శ్రీనివాసా "
No comments:
Post a Comment